కెనడా విదేశాంగశాఖ మంత్రిగా భారత సంతతికి చెందిన మహిళ

68చూసినవారు
కెనడా విదేశాంగశాఖ మంత్రిగా భారత సంతతికి చెందిన మహిళ
కెనడాలో ఎన్నికల అనంతరం ప్రధాని మార్క్ కార్నీ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్‌ను నూతన విదేశాంగశాఖ మంత్రిగా నియమించారు. గతంలో రక్షణ మంత్రిగా సేవలందించిన అనిత, ఈ పదవికి ప్రమాణస్వీకారం చేస్తూ భగవద్గీతను చేతిలో పట్టుకుని ప్రమాణం చేశారు. వైద్యులైన భారతీయ వలసదారుల కుమార్తె అయిన అనితా 2019లో ఎంపీగా రాజకీయాల్లోకి ప్రవేశించి, త్వరితగతిన ఎదిగారు.

సంబంధిత పోస్ట్