TG: సిద్దిపేట(D) అక్బర్‌పేట-భూంపల్లి(M) చౌదర్‌పల్లె గ్రామానికి చెందిన రామస్వామి అనే భారత జవాన్ భూమి కబ్జాకు గురైంది. స్థానిక వీఆర్వో సోదరుడే తన భూమిని కబ్జా చేశాడని జవాన్ ఆరోపించారు. ఆర్డీవో, కలెక్టర్లకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. దీనిపై మాజీమంత్రి హరీశ్‌రావు స్పందించారు. దీనిపై దర్యాప్తు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను అభ్యర్థించారు. సరిహద్దులో దేశ రక్షణగా ఉన్న సైనికుడికి ఇలాంటి సంఘటన ఎదురవడం దారుణం’ అని Xలో పోస్ట్ చేశారు.