టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ నటి సాగరిక ఘట్టే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని జహీర్ సోషల్ మీడియా వేదిక అభిమానులతో పంచుకున్నారు. ముగ్గురు కలిసున్న ఫొటోను షేర్ చేశారు. అయితే పెళ్లైన 8 ఏళ్లకు మగబిడ్డ పుట్టాడు. బాబుకు ఫతేసిన్హ్ ఖాన్ అని పేరు కూడా పెట్టినట్లు వెల్లడించారు. దీంతో అభిమానులు, ప్రముఖులు వారికి శుభకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం జహీర్ ఐపీఎల్‌లో లక్నో జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు.