అమెరికా న్యూయార్క్ విమానాశ్రయంలో ఒక భారతీయ విద్యార్థిని బలవంతంగా కింద పడేసి, చేతికి సంకెళ్లు వేసి బహిష్కరించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై సామాజిక కార్యకర్త కునాల్ జైన్ స్పందిస్తూ, ఆ విద్యార్థిని నేరస్థుడిలా చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, వీటిపై భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించాలని కోరారు.