భారత్‌లోని రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్ ప్రజాపత్ అమెరికాలో జరుగుతున్న గాట్ టాలెంట్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గ్రావిటీ డిఫైయింగ్ డ్యాన్స్ చేశాడు. తలపై టీ గాజు గ్లాసులపైన కుండ పెట్టుకుని బ్యాలెన్సింగ్ యాక్ట్ చేశాడు. ఏ మాత్రం తొణకకుండా.. డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. దీంతో న్యాయనిర్ణేతలు, ప్రేక్షకులు కళ్లప్పగించి చూస్తూనే ఉన్నారు. చివరికి ప్రవీణ్ డ్యాన్స్ పూర్తి చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.