తెలంగాణలో మహిళలను ప్రోత్సహించాలని, వారిని ఆర్థికంగా నిలబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆర్థిక క్రమ శిక్షణతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. తెలంగాణ, వన్ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం సాధంచాలంటే రాష్ట్రంలో కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలని చెప్పారు.1967లో చైనాతో, 1971లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగిన సందర్బంగా మహిళా శక్తిని ఇందిరా గాంధీ ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు