TG: పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని చేపట్టింది. తాజాగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇందిరమ్మ ఇళ్లు' పథకం కేవలం పేదల కోసం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఏ మాత్రం ఆర్ధికంగా మెరుగ్గా ఉన్నవారికి ఈ పథకం కింద ఇండ్లు ఇచ్చేది లేదని తెలిపారు. ఉన్నోళ్లకు ఇళ్లు ఇవ్వడం అనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.