ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారుల జాబితాలపై కార్యాచరణ ప్రణాళిక

51చూసినవారు
ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారుల జాబితాలపై కార్యాచరణ ప్రణాళిక
TG: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం నేటి నుంచి అమలయ్యేలా 23 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని, మండలంలోని నాలుగైదు గ్రామాలకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించనున్నారు. లబ్ధిదారుల జాబితాలపై జిల్లాస్థాయి అధికారులతో విచారణ చేస్తారు.

సంబంధిత పోస్ట్