ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు.. ఇందిరమ్మ ఇళ్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 'గత BRS పాలకులు వారి సౌలభ్యం, ప్రయోజనాల కోసం పథకాలు ప్రవేశపెట్టారు. ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రం ప్రజా శ్రేయస్సు కోసమే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. గోదావరి నీటిని ఆంధ్రకు తరలించేందుకు శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ పాలకులే. ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారు' అని విమర్శించారు.