TG: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని, మండలంలోని నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక గెజిటెడ్ అధికారిని నియమించనుంది. వీరు అర్హులకే ఇళ్లు అందేలా చూస్తారు. జాబితాలో అనర్హులుంటే తొలగించి, కొత్త వారికి అవకాశం కల్పిస్తారు. లబ్దిదారుల ఎంపికను ఇందిరమ్మ కమిటీలు సూచిస్తాయి.