TG: ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదించిన తర్వాతే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. గ్రామ కమిటీలు ఆమోదించిన లబ్దిదారుల పేర్ల జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి పంపి.. ఆమోదం పొందాలని సీఎం తెలిపారు.