ఈ మధ్య ఇన్ఫ్లూయెన్సర్ల హవా కొనసాగుతోంది. దీంతో భారత ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఈ ఏడాది 25% వృద్ధి సాధించనుందని ‘ఇండియా ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ రిపోర్ట్’ వెల్లడించింది. ట్రెడిషనల్, డిజిటల్ ఏజెన్సీలు, మీడియా సంస్థలు తమ మార్కెటింగ్ వ్యూహాలను విస్తరిస్తుండటం వృద్ధికి కారణంగా పేర్కొంది. అలాగే, 70% బ్రాండ్లు వారిపై ట్రస్ట్ ఉంచినట్టు నివేదిక పేర్కొంది.