TG: పోడు భూములను సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న రాష్ట్రంలోని గిరిజన రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అటవీ హక్కు పట్టాల విరాసత్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారి కల సాకారం కానుంది. అటవీ హక్కుల పరిరక్షణ చట్టం (ఆర్ఎఎస్ఆర్) కింద అటవీ హక్కు పట్టాదారుడు మృతి చెందిన వారి వారసులకు విరాసత్ పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆయా మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవచ్చు.