TG: స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని మంత్రి పొంగులేటి ప్రకటించడం బీసీలకు చేస్తున్న అన్యాయమని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ బిల్లు కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవడం సరికాదని, ఈ విషయమై ప్రధాని మోదీతో ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్లపై బీసీలను ప్రభుత్వం దగా చేస్తోందన్నారు. 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు.