ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోన్న దేశాలకు నిర్ణయం తీసుకునే జాబితాలో స్థానం దక్కడం లేదని ప్రధాని మోదీ అన్నారు. పర్యావరణ పరిరక్షణ, సాంకేతికత అభివృద్ధి తదితర అంశాలపై ప్రపంచ సంస్థల నుంచి గ్లోబల్ సౌత్ దేశాలకు కనీస సహకారం లేదన్నారు. ప్రతి విషయంలోనూ గ్లోబల్ సౌత్ దేశాలు బాధితులవుతున్నాయని అన్నారు. బ్రెజిల్‌లోని రియో డీ జనీరోలో నిర్వహించిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొన్నారు.