కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, సమాజం కోసం, కలల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఐదుగురు పేర్లను ప్రభుత్వం అధికారికంగా సిఫారసు చేసినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. ఒక్కరికి కూడా అవార్డు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. వీరిలో ఒక్కరికి కూడా అర్హత లేదా? అని ప్రశ్నించారు.