పార్టీలో కష్టపడ్డ మహిళలకు అన్యాయం: సునీతారావు

72చూసినవారు
పార్టీలో కష్టపడ్డ మహిళలకు అన్యాయం: సునీతారావు
TG: కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ మహిళలకు అన్యాయం జరుగుతుందని పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతా రావు ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్ గాంధీ భవన్‌లో సునీతా రావు ఆధ్వర్యంలో నేతలు ధర్నా చేపట్టారు. నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు అవకాశం కల్పించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ చెల్లెళ్లు, మరదల్లకు పదవులు ఇచ్చుకుంటున్నాడని ఆరోపించారు. దీనిపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్