తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగులు వినూత్నంగా నిరసనలు చేపడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ పట్టణంలోని నెహ్రూ సెంటర్‌లో సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు శనివారం నిరసన తెలిపారు. దీనిలో భాగంగా సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని మోకాళ్లపై కూర్చొని నినాదాలు చేశారు.