తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో వాతావరణ శాఖ 18 జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. నిన్న అత్యధికంగా నిర్మల్ జిల్లా లింగాపూర్‌లో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర ఎక్కువగా నమోదవుతాయని అంచనా వేసింది. చిన్నారులు, వృద్దులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.