నేటితో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు ముగింపు

85చూసినవారు
నేటితో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు ముగింపు
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పొడగించిన ఫీజు గడువు నేటి(జనవరి 30)తో ముగియనుంది. జనరల్, ఒకేషనల్, ఇంటర్ ప్రథమ, సెకండ్ ఇయర్ విద్యార్థులు తత్కాల్ స్కీం కింద రూ.3 వేల ఫైన్ తో నేటి వరకు ఫీజు చెల్లించవచ్చని బోర్డు ప్రకటించింది. ఇకపై ఎలాంటి పొడిగింపు ఉండదని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్