గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మరో దారుణం జరిగింది. 9వ తరగతి విద్యార్థినిపై ఇంటర్ చదువుతున్న ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు వివరాల ప్రకారం.. ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన విద్యార్థిని తిరిగి వస్తున్న క్రమంలో ఆమె స్నేహితుడు బెదిరించి కారులోకి ఎక్కించుకుని, ఊరి బయటకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.