వారికి రూ.20వేల కోట్లు వడ్డీ లేని రుణాలు: భట్టి
తెలంగాణ వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కేవలం హైదరాబాద్ నగర పరిధిలోనే రూ.3,000 కోట్లు ఇస్తామని చెప్పారు. అయితే దీన్ని రూ.5వేల కోట్లకు తీసుకెళ్లేలా సహకరించాలని బ్యాంకర్లకు సూచించారు. మహిళా సంఘాలకు బ్యాంకుల నుంచి రికవరీ 98 శాతం ఉంటుందని, వారి విషయంలో మానవత్వంలో ఆలోచించాలన్నారు.