పీఎఫ్ ఖాతాదారులకు EPFO గుడ్‌న్యూస్ చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ డబ్బును వారి PF ఖాతాల్లో జమ చేసింది. ఖాతాలో ఉన్న ఎంప్లాయి, ఎంప్లాయర్ షేర్ డబ్బుపై 8.25 శాతం వడ్డీకి తగినట్లు ఈ డబ్బును జమ చేసింది. ఖాతాదారుల పాసుబుక్‌లో 31-03-2025 రోజున ఈ వడ్డీ జమ చేసినట్లు అప్‌డేట్ అయింది. మీ PF ఖాతాలో వడ్డీ డబ్బులు జమ అయ్యాయా? చెక్ చేసుకోండి.