భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమూల్ విడుదల చేసిన తాజా యాడ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ‘ఆపరేషన్ సిందూర్’లో కీలక భూమిక పోషించిన కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లకు అమూల్ గర్ల్ సెల్యూట్ చేస్తున్నట్టు యాడ్‌లో చూపించారు. “Amul proudly Indian” అనే స్టేట్‌మెంట్‌తో దేశభక్తి ఉట్టిపడేలా రూపొందించిన ఈ యాడ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.