అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ గుజరాత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా నవ్‌సరి జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ‘లఖ్‌పతి దీదీ’ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతికి బాటలు వేసుకున్న మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం వారు సాధించిన విజయం, కృషిని అభినందించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.