మద్యం మత్తులో తల్లిని కర్రతో కొట్టి చంపాడు

56చూసినవారు
మద్యం మత్తులో తల్లిని కర్రతో కొట్టి చంపాడు
హరియాణాలోని సిర్సా జిల్లాలో తాజాగా దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడు మద్యానికి బాగా బానిసయ్యాడు. ఈ క్రమంలో యువకుడు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అతను మళ్ళీ మద్యం కోసం వెళ్తుండగా తల్లి చావలి దేవి వాహనంతో సహా ఆపేస్తుంది. దీంతో మద్యం మత్తులో ఉన్న కొడుకు కర్ర తీసుకుని తల్లిపై తీవ్రంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తల్లి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం జిల్లా సివిల్‌ ఆస్పత్రిలో మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్