IPL 2025 మ్యాచ్ కవరేజ్‌ను ఆహ్లాదకరంగా మార్చేందుకు IPL బ్రాడ్‌కాస్ట్ టీమ్ రోబో డాగ్‌ని పరిచయం చేసింది. ఆదివారం ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌కు ముందు బ్రాడ్‌కాస్ట్ కెమెరాలకు అనుసంధానంగా ఉన్న ఈ చిట్టి రోబోను న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ డానీ మోరీసన్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. మోరీసన్ మాటలకు రెస్పాండ్ అవ్వడం దీని ప్రత్యేకత కాగా, రోబోకి పేరు పెట్టాలని మోరీసన్ కోరాడు.