IPL-2025లో భాగంగా మరికాసేపట్లో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.