IPL-2025లో భాగంగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు లక్నో వేదికగా ప్రారంభం కానున్న ఈ మ్యాచులో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఐదింట నాలుగు మ్యాచుల్లో గెలిచి టాప్ ప్లేస్‌లో ఉన్న గుజరాత్‌ను లక్నో ఎలా ఎదుర్కొంటుంది చూడాలి.