IPL 2025 తిరిగి మే 17 నుండి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మొత్తం 17 మ్యాచ్‌లు 6 వేదికలలో జరుగుతాయి. అయితే, మిగిలిన మ్యాచ్‌లకు కొంతమంది విదేశీ ఆటగాళ్లు దూరమవుతున్నారు. వారి స్థానాల్లో కొత్త వారిని తీసుకునేందుకు ఐపీఎల్ అవకాశమిచ్చింది. అయితే, ఈ రీ ప్లేస్‌మెంట్‌లు తాత్కాలికమేనని, వచ్చే సీజన్‌కు కొనసాగవని ఐపీఎల్ మేనేజిమెంట్ బుధవారం స్పష్టం చేసింది.