IPL 2025లో తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో నికోలస్ పూరన్ బ్యాటింగ్ శక్తిని మరోసారి చూపించాడు. 34 బంతుల్లో 61 పరుగులు చేసి ఏకంగా 7 సిక్సర్లు బాదాడు. అయితే, అతడి భారీ సిక్సర్‌లో ఒకటి స్టేడియం స్టాండ్స్‌లో కూర్చున్న అభిమాని తలపై పడింది. రక్తం కారడంతో అతనికి వెంటనే అక్కడి వైద్య బృందం ప్రథమ చికిత్స అందించింది. అయినా కూడా ఆ అభిమాని మ్యాచ్ చివరకు చూసి వెళ్లాడు.