ఐపీఎల్‌లో ఒక్క డాట్ బాల్ పడితే 18 మొక్కలు నాటుతామని బీసీసీఐ, టాటా గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో ఎక్కువ డాట్ బాల్స్ వేసి అత్యధిక మొక్కలు నాటించిన బౌలర్లు ఎవరో తెలుసా? ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ 78 డాట్ బాల్స్ వేసి ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా ఆ తర్వాత మహ్మద్ సిరాజ్ (73) వరుణ్ చక్రవర్తి (70) ఉన్నారు.