ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున తెలుగు కుర్రాడు షేక్ రషీద్ ఎంట్రీ ఇచ్చారు. ఏపీలోని గుంటూరుకు షేక్ రషీద్ చెందిన CSK జట్టు ద్వారా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశారు. షేక్ రషీద్ 2022లో భారత అండర్-19 క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. సెమీస్, ఫైనల్లో రాణించి షేక్ రషీద్ భారత జట్టుకు అండర్-19 కప్ అందించారు.