తెలంగాణలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. 12 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహిస్తోంది. ఇరిగేషన్ శాఖ మాజీ ఎస్ఈ నూనె శ్రీధర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయనపై ఈ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ రోజే మాజీ సీఎం కేసీఆర్‌పై కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభమైన నేపథ్యంలో ఈ సోదాలు రాష్ట్రంలో చర్చకు దారి తీశాయి.