చక్కర కంటే బెల్లం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 'బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. బెల్లంలో ఐరన్ మెండుగా ఉంటుంది. ఇది రక్తహీనతను అధిగమించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. ఈ ప్రయోజనాలు చక్కెర తినడం వల్ల లభించవు. బెల్లంలోని పోషకాలు ఎముకలు, రక్తం, మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.' అని నిపుణులు చెబుతున్నారు.