TG: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వేపై విమర్శలు చేసిన తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై మల్లన్న స్పందిస్తూ.. కాంగ్రెస్ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నాకు ఎందుకు నోటీసులు ఇస్తారని, పార్టీ ఏమైనా.. మీ అయ్య జాగీరా.. కాంగ్రెస్ పార్టీ మాది.. బీసీలది. బీసీలకు అన్యాయం చేస్తే పండబెట్టి తొక్కుతాం' అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో దుమారం రేపుతున్నాయి.