TG: ఘట్‌కేసర్-రాయగిరి (యాదాద్రి) MMTS ప్రాజెక్టు ఈ ఆర్థిక సంవత్సరంలోనూ పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. 2025-26 బడ్జెట్‌లో దీనికి తగిన నిధులు కేటాయించలేదు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర వాటాతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వమే చేపడుతుందని ఏడాది క్రితమే రైల్వేశాఖ ప్రకటించింది. సంవత్సర కాలంలో DPR సిద్ధం చేశారు కానీ.. రైల్వేబోర్డుకు పంపడం, ఆమోదించి నిధులు మంజూరుచేసే ప్రక్రియలో జాప్యం జరిగింది. కాగా ఏడెనిమిదేళ్లుగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలోనే ఉంది.