TG: హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓపెన్ ప్లాట్ల వేలంలో రికార్డు ధర పలికింది. కమర్షియల్ ప్లాట్ గజం ధర రూ.2.98 లక్షల ధర పలికింది. చదరపు గజం ధర ఇంత భారీగా పలకడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారని రాష్ట్ర గృహ నిర్మాణ మండలి MD వి.పి.గౌతమ్ తెలిపారు. 18 స్థలాల విక్రయంతో బోర్డుకు రూ.142 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.
25 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో గజం రూ.1818 పలకడం గమనార్హం.