భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా కేంద్రం శనివారం హాఫ్ డే సెలవు ఇచ్చింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొంది. విద్యా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ హాలిడే వర్తించదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు ఇవాళ యథావిధిగా పనిచేయనున్నాయి. కాగా, నిన్న తెలంగాణలో ఉద్యోగులు, విద్యార్థులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.