కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా? అని కేంద్ర ప్రభుత్వాన్ని 'X' వేదికగా BRS నేత హరిశ్ రావు ప్రశ్నించారు. 'ఇది కేంద్ర బడ్జెట్ లా లేదు, కేవలం మూడు, నాలుగు రాష్ట్రాల బడ్జెట్ లాగా ఉంది. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు(BJP) ఉండి తెలంగాణకు ఏం సాధించినట్లు? తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని
బీజేపీ ప్రభుత్వం నిరూపించింది' అని పేర్కొన్నారు.