తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ ప్రజాస్వామ్యబద్ధంగా మంత్రులకు విన్నవించడానికి వచ్చిన VRAలపై ప్రభుత్వ వైఖరిని, పోలీస్ జులుంను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి KTR అన్నారు. 'ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజా పాలన ?. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, బాధితులు, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తే ఇలా తీవ్రవాదులను, సంఘ విద్రోహ శక్తులను అణిచివేసినట్టు దాడులు చేస్తారా' అని KTR మండిపడ్డారు.