హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి వీఆర్ఏలు మంగళవారం యత్నించారు. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఓ వీఆర్ఏ కాంగ్రెస్ సర్కారుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'మా వీఆర్ఏలకు రేవంత్ రెడ్డి, సీతక్క, తీన్మార్ మల్లన ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇవాళ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇదేనా ప్రజా పాలన' అని ఆవేదన వ్యక్తం చేశారు.