రాష్ట్ర సచివాలయంలోనే కాదు గ్రామ సచివాలయాల్లోనూ పాలన పడకేసిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. 'గ్రామాలన్నీ సమస్యల ఊబిలో చిక్కుకున్నాయి. బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయి. కాంగ్రెస్ వచ్చి పాత కష్టాలు తీసుకొచ్చింది. సీఎం ఇకనైనా మొద్దునిద్ర వీడాలి. గ్రామాల్లో సమస్యల పంచాయితీని తేల్చాలి. ప్రజా పాలన అంటే ఇదేనా?' అని Xవేదికగా ప్రశ్నించారు.