AP: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో సోమవారం చేరనున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరనున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆయన ఇప్పటికే టీడీపీ సభ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా 2024 ఎన్నికల్లో ఆళ్ల నాని వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు, పార్టీకి ఆళ్ల నాని దూరంగా ఉన్నారు.