బాలీవుడ్ ఫేమస్ జంటల్లో ఇషితా దత్తా-వత్సల్ సేత్ ఒకరు. తాజాగా ఇషితా దత్తా రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఈ విషయాన్ని ఇషితా సోషల్ మీడియాలో ద్వారా పంచుకుంది. "మేము ఇద్దరి నుంచి నలుగురిగా మారిపోయాం. ఇప్పుడు మా ఫ్యామిలీ సంపూర్ణమైంది. నాకు కూతురు పుట్టింది." అంటూ ఈ బాలీవుడ్ బ్యూటీ తన ఆనందాన్ని పంచుకుంది. కాగా, ఈ జంటకు అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు.