TG: ఎరువులను పంచడం కూడా చేతగాని రేవంత్ రెడ్డి, కేసీఆర్ లాంటి నాయకుడితో చర్చకు సిద్ధపడితే జనం నవ్వుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆధార్ కార్డు చూపిస్తే ఎకరాకు ఒక ఎరువుల బస్తా ఇవ్వాలని అధికారులకు నువ్వు చెప్పిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. 9 ఏళ్ల కాలంలో సుమారు 9 బిలియన్ డాలర్ల డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో వేశామని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చెబితే అక్కడున్న ప్రొఫెసర్లు, మేధావులు ఆశ్చర్యపోయారని చెప్పారు.