గాజాకు మానవతా సహాయం అందించేందుకు ఓ నౌకలో ప్రయాణిస్తున్న స్వీడిష్ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ను ఇజ్రాయెల్ అదుపులోకి తీసుకుంది. సముద్ర జలాల్లో విధించిన ఆంక్షలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ, గ్రెటాను తమ దేశం నుంచి బహిష్కరించామని, ఆమెను ఫ్రాన్స్‌కు పంపిస్తున్నామని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ వెల్లడించింది. అక్కడి నుంచి ఆమె స్వీడన్ వెళ్లనుందని.. ఓ ఫొటోతో కూడిన పోస్టు ద్వారా ‘ఎక్స్’లో ప్రకటించింది.