గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ దాడులతో గాజా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో 103 మంది మరణించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఉన్నారు. అజ్ జావాయ్ గా, సదరన్ గాజా స్ట్రిప్లోని ఖాన్ యూనిస్ సహా పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) బాంబు దాడి చేసింది. కాగా నిన్న జరిగిన దాడిలో 141 మంది పాలస్తీనియన్లు చనిపోయిన విషయం తెలిసిందే.