ఇజ్రాయెల్ ఎయిర్‌స్ట్రైక్స్‌లో ఇప్పటివరకు 138 మంది ఇరానీయులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. టెహ్రాన్‌లోని 14 అంతస్తుల భవనంపై జరిగిన దాడిలో 60 మంది, అందులో 29 మంది చిన్నారులుగా గుర్తించారు. దాడులు ప్రారంభమైన మొదటి రెండు రోజుల్లోనే 78 మంది మరణించినట్లు తెలిపింది. మరోవైపు, తాము ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌లపై మాత్రమే దాడులు జరుపుతున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది.