ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 224 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారని ఇరాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 90 శాతం మంది సాధారణ పౌరులేనని పేర్కొంది. మరో 1,277 మంది గాయపడ్డారని వెల్లడించింది. గత శుక్రవారం నుంచి న్యూక్లియర్ సైట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించగా, ఇరాన్ సైనికాధికారులు, అణు శాస్త్రవేత్తలను హతమార్చుతోంది.